నవ్వితే నవ్వండి
ఒకావిడ డాక్టరు వద్దకు వెల్లింది. డాక్టరు గారు ఏమిటన్నట్లుగా చూసారు.
డాక్టరుగారు, నాకు శరీరంలో ఎక్కడ నొక్కినా విపరీతమైన నొప్పి కలుగుతోంది చూడండి అంటూ బుగ్గమీద వేలితో నొక్కుకుంది. అమ్మో నొప్పి. మోకాలి మీద నొక్కుకుంది. అమ్మో నొప్పి. మరో చెతిమీద నొక్కుకుంది. అమ్మో నొప్పి, అని బాదతో సుడులు తిరిగిపోతూ, నాకొచ్చిన సమస్యేమిటి డాక్టర్ అని అడిగింది.
కాసేపు పరిశీలించి మందులు రాసిచ్చాడు డాక్టర్. అసలు సంస్యేమిటన్నట్లు చూసింది ఆవిడ. మరేం లెదమ్మా, నీ చూపుడు వేలికి దెబ్బ తగిలింది. ఆ వేలితో ఎక్కడనొక్కుకున్నా నొప్పి కలుగుతోందని తాపీగా చెప్పాడు డాక్టర్.
______________________________________________
పాకిస్తాన్ మీడియా స్టాండర్డ్స్
ముంబై మీద దాడులు భారత్, అమెరికా, ఇజ్రాయేల్ దేసాల కుట్ర అని సెలవిచ్చిన పాకిస్తాన్ వార్తా సంస్థ మీకు గుర్తుండే వుంటుంది. ఆ వార్త సంస్థ యొక్క ప్రమాణాలు ఎంతగొప్పవో, అందులో పనిచేసే వ్యాఖ్యాతలు ఎంత ప్రతిభా వంతులో మీకు ఈపాటికే అర్థమై వుంటుంది. సదరు వ్యాఖ్యాతలకే కాదు, వార్తలు చడివే ఆవిడకి కూడా, ఆంగ్లములో వున్న ప్రతిభ మనల్ను నవ్వుకునేలా చేయక మానదు. పోనీలే, ఆంగ్లము పరభాష కదా తడబడ్డారు అనుకుందాం (హీన పక్షం ). వారికి తమ మతృభాషలో వ్యాఖ్యానము కూడా (Anchoring) చేయడం రాదనడానికి తిరుగులేని సాక్షం మరొకటి దొరికింది.., దాన్ని చూడాలి అనుకుంటే ఈ కింద ఇచ్చిన విడియో లంకెను నొక్కండి ఒకసారి..
____________________________________
నవ్వితే నవ్వండి
ఒకరోజు:
రాత్రంతా భార్యకోసం ఎదురుచూసాడో భర్త, తను రాలేదు. మరుసటి రోజు ఉదయాన్నే వచ్చింది. తీవ్ర అనుమానంతో, రాత్రంతా ఎక్కడున్నావని భార్యని నిలదీశాడు.
తన ప్రాణ స్నేహితురాలు ఇంటిలో ఫంక్షను వుంటే వెల్లానని, రాత్రంతా అక్కడే వుండాల్సి వచ్చిందని తడబడుతూ చెప్పింది భార్యామణి.
సదరు భర్తగారు అనుమానం తీరక తన భార్యకున్న మంచి స్నేహితులలో 10 మందికి ఫోను చేసి అడిగాడు. అందరూ ఆమె రాత్రి తమదగ్గర లేదని బదులిచ్చారు.
ఇంకో రోజు:
ఈసారి భర్త ఇంటికి రాలేదు. భార్యామణిగారు రాత్రంతా అతనికోసం చూసారు. మరుసటిరోజు తెల్లవారు ఝామున తాపీగా ఇంటికి వచ్చారు భర్తగారు.
ఎక్కడున్నారు రాత్రంతా అని అనుమానం, ఆగ్రహం కలగలసిన కంఠంతో నిలదీసింది భార్యామణి.
తన ప్రాణస్నేహితుడు పార్టీవుంది రమ్మని పిలిస్తే వెల్లానని, రాత్రంతా అక్కడే వుండాల్సి వచ్చిందని తడబడుతూ చెప్పారు పతిదేవులు.
అనుమానం తీరని ఆ భార్యామణి, తన భర్తకున్న 10 మంది ప్రాణస్నేహితులకు ఫోను చేసి అడిగింది.
అందులో 5 మంది, రాత్రంతా అతను తన దగ్గరే వున్నాడని నమ్మకంగా చెప్పారు. మరో 5 మంది ఇంకా అతను తన దగ్గరే వున్నాడని, మరికొద్దిసేపట్లో బయలుదేరి వస్తాడని భరోసా ఇచ్చారు..
నీతి ఏమిటయ్యా అంటే… మగవాల్లే మంచి స్నేహితులు
________________________________________________
తుంటరి ప్రశ్నలు??? కొంటె జవాబులు...
అతిగా గొప్పలు చెప్పడమంటే…?
నా రక్తం B-పాజిటివ్ కాబట్టి, నేనెప్పుడూ పాజిటివ్ గా వుంటానని చెప్పడం.
నీవు లేనిదే నేను లేనన్న ప్రియురాలిని సుబ్బారావ్ ఎందుకు తిరస్కరించాడు..?
అప్పుడు పక్కనే ఆయన భార్య వుంది మరి.
ఎవరికీ ఇష్టంలేని పాజిటివ్..?
హెచ్.ఐ.వి పాజిటివ్.
__________________________
పాట సామెతలు.......... కొత్త సామెతలు ..........
తాతకు దగ్గులు నేర్పించడమంటే..?
రాజకీయ నాయకులకు స్కాములు చేయడం నేర్పించడం.
చేప పిల్లకు ఈత నేర్పాలా..
ఆ స్ట్రేలియన్ క్రికెటర్లకు స్లెడ్జింగ్(దూషించడం) నేర్పించాలా..
తొండ ముదిరి ఊసరవెళ్ళి అయినట్లు…
రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్లు..
తాతకు దగ్గులు నేర్పడమంటే…?
బిల్ గేట్స్ కి డబ్బు సంపాదించడమెలాగో చెప్పడం.
ఆడలేక మద్దెల ఓడన్నట్లు..
సినిమా తీయడం చేతకాక…ఫ్లాప్ కు కారణం పైరసీ అన్నట్లు.
ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న…ఏరు దాటాక బోడి మల్లన్న.
ఫాం లో ఉన్నంతవరకూ మాస్టర్ బ్లాష్టర్ సచిన్…ఫాం పోగానే వెటరన్ సచిన్.
తాడిచెట్టెందుకెక్కావ్ రా అంటే దూడకు మేతకన్నట్లు..
ఈవ్ టీజింగ్ చేసావేరా అంటే..అమ్మాయి డ్రస్సు బాగాలేదన్నట్లు.
తావలచింది రంభ.
తమ అభిమాన నటుడే నెంబర్ వన్.