Tuesday, September 29, 2009

చిన్న చిన్న జోక్స్ - (అ)

Joke

"ఏంటీ మీ అబ్బాయి అచ్చుగుద్దినట్లు వాళ్ల నాన్నలా పుట్టాడా.. ఎలా..?" ఆరా తీసింది వినోదిని

"ఆ... మరేంలేదు, మరి... మా ఫస్ట్‌నైట్‌ అప్పుడు, మావారు జిరాక్స్‌ మిషన్‌ను తెచ్చి మా గదిలో ఉంచార్లేవే.. అందుకే వాడు అలా పుట్టాడు" బడాయిగా చెప్పింది రమ.
___________________________




Comedy
"ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా మీరిచ్చిన మాత్రలు వేసుకుంటున్నారు. అవి బాగా పనిచేస్తున్నాయో, ఏమోగానీ.. అందరూ చచ్చినట్లు నా పాటలు వింటూ, పడుకుంటున్నారు. పైగా జోలపాటలా ఉందంటున్నారు" సంతోషంగా చెప్పింది సుందరి

"అందుకే కదమ్మా... నేను నిద్రమాత్రలు రాసిచ్చింది. ఇక నువ్వు హ్యాపీగా సంగీతం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా...!!" అంది సురేఖ.
___________________________



Joke

సుజాత : డాక్టర్‌గారూ...! మా కుక్కకి మధ్యలో కొన్ని పళ్లు ఊడిపోయాయేమోనని నా అనుమానం

డాక్టర్‌ : అలాగని ఎందుకనుకుంటున్నారు..?

సుజాత : మొన్నామధ్య ఇది మా ఆయన పిక్కమీద కరిచింది లేండి. తరువాత ఆయన పిక్కమీద చూస్తే... కుక్క పళ్ల గుర్తులన్నీ కనపించకుండా, మధ్యలో కొంత గ్యాప్‌ కనిపించింది. అందుకని...!!
___________________________





Doctor

"మీ మొహంమీద మచ్చలు తగ్గేందుకు నేనిచ్చిన ఆయింట్‌మెంట్ బాగా పనిచేస్తోందా...?" అడిగాడు డాక్టర్

"ఓ.. బేషుగ్గా పనిచేస్తోందండీ... కాకపోతే, ఇంతకు ముందుకంటే ఇప్పుడు మచ్చల్ని అద్దంలో స్పష్టంగా చూడగలుగుతున్నాను డాక్టర్..!" దిగాలుగా చెప్పింది సుభద్ర.
___________________________





Joke
"నాకున్న బద్దకమే నా కొంప ముంచింది..!" అన్నాడు విఘ్నేష్

"ఏమయింది?" అని అడిగాడు రాజు

"మొన్నపరీక్ష హాలుకు కాపీ కొట్టడానికి పేపర్లు తీసుకెళ్లి... ఇన్విజిలేటర్‌ను రాయమంటే, డీబార్ చేశాడు" చెప్పాడు
___________________________


విఘ్నేష్.

Joke
"మీ ఆవిడకు నీ మీద ప్రేమ ఎక్కువ కదరా?" అడిగాడు సుందర్

"అవును.. మరి అంత చలిలో కూడా స్వెట్టర్ తొడిగి మరీ నా చేత అంట్లు తోమిస్తుంది..!" చెప్పాడు వినోద్.
___________________________




Joke
"పండగొచ్చిందిగా అల్లుడు గారేరమ్మా...?" అడిగాడు తండ్రి

"నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళారు నాన్నా...!" బాధగా బదులిచ్చింది కూతురు.
___________________________




Comedy

"అడుక్కున్నదంతా ఏం చేస్తావోయ్...?" అడిగింది సుజాత

"మా తోటి బిచ్చగాళ్లందరికీ దానం చేస్తానమ్మా..!" అని చెప్పాడు భిక్షగాడు.
___________________________




Joke

సూర్యం: "నీ నలభై ఎళ్ల జీవితంలో ఎవరినైనా ప్రేమించావా..?"

చంద్రం : "అవును.. కాని ఈ విషయాన్ని పొరపాటున కూడా మా ఆవిడతో చెప్పొద్దు...!"
___________________________




Joke
సరిత : "సుశీలా మీ ఆయన ఆఫీసుకి కూడా నైట్ డ్రెస్‌లో వెళ్తున్నారెందుకు ? ఇస్త్రీ వాడు బట్టలు ఇవ్వలేదా..?"

సుశీల : "అదేమీ కాదు ఇంట్లో నేను సతాయిస్తున్నానని ఆఫీసుకి నిద్రపోవడానికి వెళ్తున్నారు..!"
___________________________




Joke

షాపింగ్ ముగించుకున్న వినోద్, సీత తమ స్కూటర్‌లో ఇంటికి బయల్దేరారు. కొంచె దూరం వెళ్లాక..

వినోద్ : "అయ్యయ్యో ఇందేంటి బ్రేక్ పడటం లేదు.. ఇప్పుడెలా....!?"

సీత : "ఏమిటండి వెతుకుతున్నారు..?"

వినోద్ : "బ్రేక్‌లు పడటం లేదే."

సీత : "ఓ అదా స్పీడ్ తగ్గించేవి బ్రేకులని మీరు ఆ రోజు చెప్పారుగా..!

అందుకే మనం త్వరగా ఇంటికెళ్లాలని వాటిని నేనే తీయించేశా.."?
___________________________
"రావయ్యా సుబ్బులు...! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్

"ఎందుకండీ...?" అన్నాడు సుబ్బులు

"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందట"

"ఫర్వాలేదు సార్... మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చేసింది లేండి..!!"

No comments:

Post a Comment

సినిమా సేవ

by-pages

live traffic

SMS