Tuesday, September 29, 2009

చిన్న చిన్న జోక్స్ - (ఇ)

Joke


డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు సురేష్



"రెండెందుకండీ...?" అమాయకంగా అడిగాడు సేల్స్‌మేన్



"ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు కాబట్టి... ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి..!!"

___________________________________



Joke


ఓ చోట సదానంద స్వామివారు జీవహింస గురించి ఉపన్యాసమిస్తున్నారు.



అది వినడానికి వెంకటేశం అక్కడకు వెళ్లాడు. ఆ సమయంలో స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు



"భక్తులారా జీవ హంస చాలా పాపం అందుకనీ మీరు జీవ హింస చేసి సంతోషించరాదు"

___________________________________





Joke


తన స్నేహితురాలు సుధ వెన్నంటి ఎప్పుడూ ఓ గాడిద రావడాన్ని గమనించిన సుమతి ఇలా అంటోంది



సుమతి : "ఏమే సుధా..? ఎప్పుడూ నీ వెనకాలే ఆ గాడిద ఎందుకు వస్తోందే..?"



సుధ : "అదేం లేదే నాకు వచ్చిన లవ్ లెటర్లన్నీ దానికే ఇచ్చాను. అవి తినడంతో అది నా వెనుక విశ్వాసంతో వస్తోంది...!"



"ఇది విన్న వెంకటేశం ఆ మాటను కాస్త గట్టిగా చెప్పండి. నా భార్య కూడా వింటుంది..!" అన్నాడు పక్కన కూర్చున్న భార్యను భయంతో చూస్తూ..

___________________________________





Joke


తహసిల్దార్ ఆఫీసులో పనిచేసే వినోద్ ఇంట్లో కూర్చుని ఏకాగ్రతతో పుస్తకం చదువుతున్నాడు.



ఆ సమయంలో ఉన్నట్టుండి కరెంట్ పోయింది. చిరాగ్గా ఈబీలో పనిచేసే రామారావుతో ఇలా అన్నాడు



"ఒరేయ్ రామారావు ఏమిట్రా? వేళాపాళా లేకుండా కరెంటు పోయింది. అయినా ఇది వేసంకాలం కూడా కాదే..!"



"సర్టిఫికేట్ కోసం ఈబీ వాళ్లొస్తే.. దసరా మామూళ్ల కోసం, ఆఫీస్ చుట్టూ తిప్పావట కదా అందుకే ఇలా..!" అసలు విషయం చెప్పాడు రామారావు.

___________________________________





Comedy
తల్లి : "నెల క్రితమేగా పెళ్లైంది. అంతలోనే విడాకులు కావాలంటున్నావు దేనికే..?"



కూతురు : "మొన్న రాత్రి ఆయన నా మనసును గాయపరిచే మాట అన్నారు"



తల్లి : "ఏమన్నాడు..?"



తల్లి : "నాకు వంట చేయడం రాదని అన్నాడు...!"

___________________________________





Doctor


తనకొచ్చిన రోగం గురించి డాక్టరుతో సుమంత్ ఇలా అన్నాడు



సుమంత్ : "డాక్టర్ నాకో జబ్బు వచ్చింది."



డాక్టర్ : "ఏంటది..?"



సుమంత్ : "ఏం లేదు డాక్టర్ అన్నం తిన్న తర్వాత ఆకలేయట్లేదు".

___________________________________





Joke


"వెంకయ్యా నీకీ విషయం తెలుసా..? నేను పేపర్ చదవడం మానేశానోయ్" చెప్పాడు సుందరయ్య



"ఎందుకు..? బిల్లు ఎక్కువవుతుందని మానేశావా..?" అడిగాడు వెంకయ్య



"అబ్బే అదేంలేదు.. మా పక్కింటి వాళ్లు పేపర్ తెప్పించడం మానేశారుగా..!" అసలు విషయం చెప్పాడు సుందరయ్య.

___________________________________





Joke


"మా ఆయనకు ఈ మధ్య తెలివి చాలా ఎక్కువైందే" సంబరంగా చెప్పింది రాధ



"ఏంటే అలా అంటావు ఏమైందేంటి" ఉత్సాహంతో అడిగింది సుజాత



"నాకు షార్ట్ హ్యాండ్ రాదని ఆయన కొలీగ్‌కు షార్ట్ హ్యాండ్‌లో లెటర్లు రాస్తున్నారే..! అసలు విషయం చెప్పింది రాధ.

___________________________________





Joke


"ఏం చేస్తున్నావురా..?" అడిగాడు తండ్రి



"స్టడీ చేస్తున్నా నాన్నా..?" చెప్పాడు కొడుకు



"ఎవరిని స్టడీ చేస్తున్నావురా..?"



"పక్కింటి అమ్మాయిని..!".

___________________________________



Joke


"ఈ రోజు ఓ ఆర డజను సూపర్ బజార్లు తిరిగానయ్యా? అయినా నాకు కావాల్సింది ఎక్కడా దొరకలేదు.." నిరుత్సాహంగా చెప్పాడు సుందర్



"అలాగా.. ఇంతకీ నీకు కావల్సింది ఏమిటో..?" అడిగాడు రమేష్



"ఇంకేముందీ... అప్పే కదా..!" చెప్పాడు సుందర్.

___________________________________





Student
"పిల్లికి ఎలుకకు గల సంబంధం ఏమిటీ?" అని అడిగారు మాష్టర్ స్టూడెంటును...



"భార్యా భర్తల సంబంధం సార్...!" వెంటనే తడుముకోకుండా చెప్పాడు అల్లరి స్టూడెంట్.

___________________________________





Joke


"నీ భార్యను ఎందుకు చంపావు? అని అడిగాడు జడ్జి" ముద్దాయిని...



"పసుపు కుంకుమలతో పోవాలని కోరితేనూ..!" బాధపడుతూ చెప్పాడు ముద్దాయి.

___________________________________





Comedy


"కులవృత్తిని నమ్ముకుంటే బాగుపడతారని అంటే.... కులవృత్తిని చేపట్టాను... అయినా నన్ను జైల్లో పెట్టారు.."



"అది ఎలాంటి కుల వృత్తి...?"



"మా తాత ముత్తాతల నాటి దొంగతనం!"



No comments:

Post a Comment

సినిమా సేవ

by-pages

live traffic

SMS