Tuesday, September 29, 2009

చిన్న చిన్న జోక్స్ - (ఈ)

JOke

"ఏరా? సత్యం కాలేజీ నుంచి రామ్ కాలేజీకి మారావట... ఏంటి సంగతీ...?

"చెత్త కాలేజ్ ఒక్కరు సరిగ్గా లేదు..."

"ఎవరు ప్రొఫెసర్లా!?"

_____________________________

Joke

"మీ అబ్బాయిని లాయర్ చదివించావుగా? ఎలా ఉంది ప్రాక్టీస్?"

"ఏం ప్రాక్టీసో.. ఏమోగానీ..."

"మొదట ఆస్తిలో వాటా కావాలని" కేసును నా మీదే పెట్టాడు..!!!

_____________________________

Joke

"ఏమనుకుంటున్నావో ఏమో..! నాకు గనక కోపం వస్తే ఈ ప్రపంచం అంతా మాడి మసైపోక తప్పదు..!" బెదిరిస్తూ అన్నాడు భర్త

"అంత వద్దులే గానీ.., ముందు కాస్త ఈ పొయ్యి వెలిగించి చూపండి చాలు..!" తిక్క కుదిరేలా బదులిచ్చింది భార్య.
_____________________________

Joke

"నీ చిన్ననాటి కల ఇప్పటికి నిజమయ్యిందిరా.." చెప్పాడు రంగారావు

"ఏంటది..?" అడిగాడు సుబ్బులు

"మా మాస్టారు కొట్టినప్పుడల్లా జుట్టు లేకుండా ఉంటే బాగుండునని కలలుకనేవాణ్ణిలే..!!"
_____________________________

Joke
"అయ్యో.. బేరర్.., నాకిచ్చిన టీలో ఈగ తేలుతోంది చూడు.." గాబరాగా అన్నాడు కస్టమర్

"కొద్ది సేపు ఆగండి సార్.., అదే మునిగిపోతుంది.." నింపాదిగా బదులిచ్చాడు బేరర్.
_____________________________

Comedy

"ఒక అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలంటే ఈ రోజే కరెక్ట్టు..ఒక వేళ ఒప్పుకుందనుకోండి సంతోషమే ..లేదా నో అందంటే, అక్కా ఏప్రిల్ ఫూల్ అని వేరే అమ్మాయీని వెతికే పనిలో పడొచ్చు !!" చెప్పుకుంటూ పోతున్నాడు సుధీర్

"నీ కథ అలా ఉంచితే.. నా భార్యామణికి వడ్డాణం చేయిస్తానని ప్రామిస్ చెయ్యడానికి ఇంతకు మించిన తరుణం లేదు" అని అన్నాడు కొత్తగా పెళ్లయిన వినోద్.
_____________________________

Comedy
"కులవృత్తిని నమ్ముకుంటే బాగుపడతారని అంటే.... కులవృత్తిని చేపట్టాను... అయినా నన్ను జైల్లో పెట్టారు.."

"అది ఎలాంటి కుల వృత్తి...?"

"మా తాత ముత్తాతల నాటి దొంగతనం!"
_____________________________

Doctor

సుధ : "డాక్టర్ మా తాతగారిని ఎలాగైనా బ్రతికించండి..!"

డాక్టర్ : "ఆహా ఈ రోజుల్లో కూడా తాతగారిపై ఎంత ప్రేమమ్మా నీకు..!"

సుధ : "అది కాదు డాక్టర్ ఈ ఏడాది బ్రతికుంటే నా పుట్టినరోజుకు స్కూటీ కొనిస్తానన్నారు..!"
_____________________________

Comedy

మహాలక్ష్మి : "వదినా మీ అబ్బాయికి పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేస్తానని అప్పుడెప్పుడో అన్నావు కదా..?"

కవిత : "అవును వదినా ఈ కాలంలో పైసలు చెల్లవు కనుక అలా అన్నాను..!"
_____________________________


Joke
అప్పుడే సినిమాకెళ్లొచ్చిన సుందరిని చూసి సుభద్ర ఇలా అడిగింది

సుభద్ర : ఏమే సినిమాకెళ్లావు కదా ఎలా ఉంది?

సుందరి : "ఏమోనే నేను చూడలేదు..!"

సుభద్ర : "అదేమిటి సినిమాకెళ్లావు కదా చూడలేదంటాటేవిటే..?"

సుందరి : "నా ప్రక్కన కూర్చున్నావిడ మెళ్లో వజ్రాల హారం చూశాక నాకింకేమి కనిపించలేదే..!"
_____________________________

Doctor

"మా నాన్నగారి డెత్ సర్టిఫికేట్ ఇస్తేగానీ.. మా అమ్మకు పెన్షన్ ఇవ్వరట... అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్‌గారూ...!" అన్నాడు హరి

"ఓ అలాగా... దానికేం భాగ్యం, ఇంతకీ మీ నాన్నగారికి వైద్యం చేసిన డాక్టర్ ఎవరు?" అడిగాడు డాక్టర్ సుందర్

"మా నాన్నగారు చాలా అదృష్టవంతులండీ... ఏ డాక్టరూ వైద్యం చేయకుండానే, ఆయనంతట ఆయనే హాయిగా పోయారండీ..!!"
_____________________________

Joke

"చిరంజీవి కొడుకు సినిమా పేరు చిరుత, చిరు తనయ అయితే... మరి మిగతా హీరోల కొడుకుల సినిమాలు ఏమి అవ్వచ్చు?" అడిగాడు రాజు

"బాలకృష్ణ కొడుకు- బుడత, వెంకటేష్ కొడుకు-ఉడత, మోహన్‌బాబు కొడుకు-మిడత, పవన్ కళ్యాణ్ కొడుకు-పిచుక" అని వచ్చేస్తాయోమోరా" నవ్వుతూ చెప్పాడు వినోద్.


No comments:

Post a Comment

సినిమా సేవ

by-pages

live traffic

SMS