Wednesday, September 30, 2009

ఘుమ-ఘుమలు: బంగాళా బౌ-బౌ -- తయార్

కావలసిన పదార్ధాలు:
కోడిగుడ్లు – 4
బంగాలా దుంపలు – మీడియం సైజుది ఒకటి.
నూనె – తగినంత.
కారం – నాలుక చర్రుమనిపించేంత.
ఉప్పు – తగినంత
పోపుగింజలు – తగినంత.

తయారు చేయు విధానం: ముందుగా బంగాళా దుంప చెక్కు తీసి, దాన్ని పలుచగా, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బాణాలిలో బంగాళా దుంపలకు సరిపడినంత నూనె వెసి, మొదట పోపుగింజలు వేయించాలి. తరువాత, బంగాళా దుంపలు అందులో వేసి బాగా వేయించాలి. (ముందుగా ఉడికించి తరువాతైనా వేయించొచ్చు, కాకపోతే అప్పుడు అంతగా వేయించవలసిన అవసరం వుండదు). బాగా వేగాయన్న నమ్మకం కుదిరిన తరువాత, గుడ్లను కొట్టి అందులో పోయాలి. ఇప్పుడు గరిటతో తిప్పుతూ ఉప్పూ కారం వేయాలి, ఇలా ఒక రెండు మూడు నిమిషాలు గరిటతో కలియబెట్టి దించేయాలి. అంతే, వేడి వేడి బంగాళా బౌ – బౌ రెడీ.

హెచ్చరిక:
తిన్న తరువాత కడుపులో తిప్పడం కానీ, ఇంకా ఏవైనా సైడు కానీ వస్తే మాత్రం నన్ను తిట్టుకోకండి. ఇది సరదా వంట, సరదాగానే తీసుకోండి. ఇంకోసారి మా ఘుమ-ఘుమలు శీర్షికలో మరో కొత్త వంటకంతో కలుస్తాను అంతవరకు ఒక షార్ట్ బ్రేక్.

P.S: ఇదే పద్దతిలో మీరు కాకరకాయ కావ్-కావ్ కూడా తయారు చేయొచ్చు.

ఇట్లు,
నాని గాడు..

No comments:

Post a Comment

సినిమా సేవ

by-pages

live traffic

SMS